News

న్యాయం చేకూరేది ముఖ్యమంత్రి వల్లే


ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాపులకు న్యాయం చేకూరేది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల్లేనని అన్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం పోయిందన్నారు. ఇప్పటికే ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలు వైసీపీని వీడారని, ఇంకా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగాక.. రాజధాని కూడా నిర్మించకూడదన్న లక్ష్యంతో జగన్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తుని సంఘటన జరగక ముందే ముద్రగడ పద్మనాభాన్ని భూమన కరుణాకరరెడ్డి కలిశారని చెప్పారు. ఆ తర్వాత సీఐడీ విచారణ జరిపి కరుణాకరరెడ్డితోపాటు పలువురిపై కేసులు నమోదు చేసిందన్నారు. కాపులకు జగన్‌ మద్దతు ఎంతమాత్రం అవసరం లేదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.